సత్రము గురుంచి ఒక మాట
ప్రతీ పుణ్యక్షేత్రంలొనూ ఆయా కులములవారికి సంబందించిన సత్రములు వున్నవి.అవి వారి కులములకు చెందిన సంక్షేమమును అనగా భోజనము, వసతి, స్నానాధికములతో వుపయోగపడుచున్నవి ఆ విధముగానే నరసరావుపెట దగ్గరగా వున్న కోటప్పకొండ పుణ్యక్షేత్రము నందు కూడా వివిధ కులములకు సత్రములు కలవు. మన యానాది కులము వారు చాలా ఇబ్బందులకు లోనవుచున్నారు. దీనిని ద్రుష్టిలో వుంచుకొని "థి నరసరావుపెట మత్ష్యకారుల సహకార సంఘం"వారు నరసరావుపెట సమీపంలోని కోటప్పకొండ పున్యక్షేత్రమునందు ప్రతీ మహశివరాత్రికి మన యానాది వారికి ప్రత్యేకముగా సత్రములు ఏర్పాటుచేసి అందు అన్నదానమును, వసతిని, వయిద్య సదుపాయమును ఎర్పాటుచేసివున్నారు. ఇది 2006వ సంవత్సరం నుంచి ప్రారంబించబడి ప్రతి సంవత్సరం కొనసాగించబడుచున్నది. ఇందు ప్రతి సంవత్సరం రాష్త్రనలుమూలల నుంచి సుమారు 20,000 వేల మందికి పైగా యానాది వారు ఈ సత్ర సదుపాయమును వుపయోగించుకొని లబ్ధి పొందుచున్నారు.