ఈ కోటప్పకొండ పుణ్యక్షేత్రమునందు ప్రతి సంవత్సరం మహశివరాత్రినాడు సందర్సించు మన యానాది వారి కష్టములను గుర్తించి, మన సంఘం వారు గమనించి, 2006 సంవత్సరం నుంచి, మన వారికి ప్రత్యేకముగా సత్రమును కోటప్పకొండ పుణ్యక్షేత్రమునందు ఏర్పాటుచేసినారు, మరియు ప్రతి సంవత్సరం 20,000మంది కి పైగా మన యానాది కులమువారికి భోజనము, వసతి, వైద్యాది సదుపాయమును మరియు సేవలును అందించుచున్నారు. దీని నిమిత్తము ఆయా ప్రాంతముల యానాది వారి నుండి విరాళములను "ది మత్స్యకారుల సహకారసంఘం" వారు 2006 సంవత్సరం నుండి సేకరించుచున్నారు. ఈ విధముగా మన సంఘం వారు ఏడు సంవత్సరములనుండి నిర్విఘ్నముగా జయప్రదము చేయుచున్నారు. ప్రతి సంవత్సరము వసూలు చేయబడిన విరాళములు, కానుకలు ఈ కార్యక్రమమునకు అయ్యే ఖర్చులు, అన్ని వివరములు, ఈ వెబ్ సైట్ నందు వుంచబడినవి. కావున మన వారు ఎక్కడైనను సులభముగా చూసి అనందించి, తెలుసుకొని మిగితా వారికి తెలియజేయుటకు మరియు ఈ దైవకార్యక్రమమును జయప్రదము చేయుటకు ఈ వెబ్ సైట్ తయారుచెయబడినది. ఇది పారదర్శకముగా నిర్వర్తించబడుచున్న సేవాకార్యక్రమము. ఈ సత్రమునకు బిల్డింగ్ సదుపాయము ఇంకా ఎర్పాటుచేయబడలేదు. ప్రస్తుతము ఈ కార్యక్రమమును మన కుల సహకర సంఘము టెంటులద్వారా నిర్వహించబడుచున్నది.