దాతలకు విఘ్నప్తి

13/02/2013 10:09

మన యానాదుల అన్నదానసత్రము 7వ వార్షికోత్సవము సంధర్బముగా నిర్వాహణకొరకు మన కుల సంఘముల నుండి మరియు వ్యక్థిగథముగ విరాళములు సేకరించుట గురుంచి 

 

 
ఇందు మూలముగా యానాది సోదర, సోదరీమణులకు తెలియుచేయునది ఏమనగా కోటప్పకొండ పుణ్యక్షేత్రమునందు అన్ని కులముల వారు చందాలు వసూలు చేసి సత్రమునందు సదుపాయములను ఏర్పటు చేసుకొనుచున్నారు. అదే విధముగా ఈ సంవత్సరము 10/3/2013 మహశివరాత్రి సందర్భముగ సుమారు 10'000 వేల మందికి తగ్గకుండా సత్రము నందు అన్నదానము, వసతి నిర్వహించదలచి పెద్దలు నిర్ణయము తీసికొన్నందున అన్ని పట్టణము మరియు గ్రామముల లోని మన సంఘీయులందరు తమతమ శక్తి కొలది విరాళములు ఇచ్చి ఈ కార్యక్రమమును జయప్రదము చేయగొరుచున్నాము.                  దాతలనుండి వసూలుచేసిన చందా మొత్తములో 10% దారి ఖర్చులకింద వుంచుకొని మిగితా 90% 8/3/13 నాటికి నరసరావుపేట సొసైటీ కార్యాలయమునందు అప్పగించి తగు రసీదు పొందగలరు. దాతల వివరములు తప్పనిసరిగ ఇవ్వవలయును.                                                                                                                                                                                              
అధ్యక్షులు :-  అల్లూరి.వెంకటేశ్వర్లు                                                  ఇట్లు  , అన్నదానసత్రము కమిటీ, నరసరావుపేట.